లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాల (Telangana Inter Results 2025) విడుదలకు రంగం సిద్ధమైంది.

By Features Desk
Updated : 21 Apr 2025 16:13 IST
1 min read
Inter Results | ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇంటర్ పరీక్షల ఫలితాల (Telangana Inter Results 2025) విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని తెలిపారు.
విద్యార్థులు తమ ఫలితాలను results.eenadu.net, tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగ్గా.. దాదాపు 9.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
Published : 21 Apr 2025 16:01 IST
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి
సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు
యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు
లేదు.