Samantha Bond With Hero : సమంత ఏమి మాట్లాడినా అది ఒక వార్తగానే నిలుస్తుంది. అందుకు ముఖ్య కారణం ఆమెకు సౌత్ ఇండియాలో ఎంతోమంది అభిమానులు ఉందటం. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక హీరో గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

1
/5
ఏమాయ చేశావే సినిమా ద్వారా పరిచయమైన సమంత..తన అందం, అభినయం ద్వారా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఆ తరువాత మహేష్ బాబుతో కలిసి నటించిన ‘దూకుడు’ చిత్రం సమంతకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం ఆమెను స్టార్ హీరోయిన్‌గా మలిచింది.

2
/5
చాలా తక్కువ సమయంలోనే సమంత టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క తెలుగు కాదు, తమిళ సినిమాల్లో కూడా సమంత మంచి పేరు సంపాదించారు.

3
/5
అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కొన్ని కలతలు చవి చూసింది. నాగచైతన్యతో ప్రేమలోపడి వివాహం చేసుకున్న సమంత, కొన్ని సంవత్సరాల వ్యవధిలో విడాకులు తీసుకున్నారు. తర్వాత సమంత ఆరోగ్యపరంగా మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతూ కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ అనే సినిమాలో కనిపించారు.

4
/5
ప్రస్తుతం సమంత చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక సినిమాల్లో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో.. నటుడు రాహుల్ రవీంద్రన్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హీరోగా కెరీర్ ప్రారంభించిన రాహుల్, ఇప్పుడు దర్శకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే..

5
/5
తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు రాహుల్ ఎంతో అండగా నిలిచారని చెప్పుకొచ్చింది సమంత. ప్రతిరోజు తనతోనే ఉండేవాడని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకునేవారని చెప్పకు వచ్చింది.
“ మా బంధానికి ఎటువంటి పేరు పెట్టలేము. రాహుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు రక్తసంబంధీకుడా,” అని భావోద్వేగంగా వెల్లడించింది.